134 బస్తాల్లో రూ. 15వేల కోట్ల డ్రగ్స్ రవాణా.. పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా సీజ్

134 బస్తాల్లో  రూ. 15వేల కోట్ల డ్రగ్స్ రవాణా.. పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా సీజ్

కేరళ తీరంలో 15 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 2,500 కిలోల బరువు కలిగిన సూపర్ క్వాలిటీ మెథాంపెటమైన్‌ను స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ సముద్రగుప్త్‌లో భాగంగా డ్రగ్స్ ఏజెన్సీ, ఇండియన్ నేవీ జాయింట్ ఆపరేషన్‌లో  ఈ డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి సముద్రంలో డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు సీజ్ చేశారు. 

మక్రాన్ తీరం నుండి భారీ మొత్తంలో మెథాంఫేటమిన్‌ను మోసుకెళ్తున్న "మదర్ షిప్" కదలికపై నేవీ యొక్క ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు తరలిస్తుండగా నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ నేవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవలను అధికారులు పట్టుకున్నారు. రెండు పడవలు తప్పించుకున్నాయి. పట్టుబడిన మెథాంఫేటమిన్ డెత్ క్రెసెంట్ నుండి తీసుకోబడుతుందని నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. ఓ పెద్ద నౌకలో 134 బస్తాల డ్రగ్స్ ను తరలిస్తున్నట్లు పేర్కొంది.