ట్రైబల్ ప్రాంతాల్లో చదువు అందించే ఉద్దేశంతో ఆర్థిక సాయం

 ట్రైబల్ ప్రాంతాల్లో చదువు అందించే ఉద్దేశంతో ఆర్థిక సాయం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లలోని అరవై ఎకల్‌‌  విద్యాలయాలకు ఆర్థికంగా సాయం అందించేందుకు ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీకి   రూ. 13,20,000 లను  ఎన్‌‌సీసీ అందించింది.  మారుమూల  ట్రైబల్ ప్రాంతాల్లో కూడా చదువు అందరికి అందే ఉద్దేశంతో  ఈ ఫండ్స్‌‌ను  కంపెనీ అందించింది. ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ సెక్రెటరీ పంకజ్  అడుకియా, రాష్ట్ర వైస్ ప్రెసిడెట్‌‌ అజయ్ అగర్వాల్‌‌, ట్రెజరర్‌‌‌‌  విష్ణు  గుప్తాలకు ఎన్‌‌సీసీ మాదాపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌ ఏజీకే రాజు  చెక్ అందించారు.  
 

ఎన్‌‌సీసీ సీఎస్‌‌ఆర్‌‌‌‌లో భాగంగా ఈ ఫండ్స్‌‌ను కంపెనీ ఎకల్‌‌ స్కూళ్ల కోసం ఇచ్చింది. సీఎస్‌‌ఆర్‌‌‌‌లో భాగంగా కంపెనీ  రూరల్ హౌసింగ్, స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌, ఎంటర్‌‌‌‌ప్రెనూర్‌‌‌‌షిప్‌‌, ఎడ్యుకేషన్ వంటి వివిధ  విభాగాల్లో డబ్బులు ఖర్చు చేస్తోంది.  ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీని 1989 ఏర్పాటు చేశారు. ఆదివాసి, రూరల్ ట్రైబల్ ప్రాంతాల్లో  అక్షరాస్యతను పెంచే లక్ష్యంగా దేశంలో 75 వేల ఎకల్ విద్యాలయాలను ఈ సంస్థ ఏర్పాటు చేసింది.