చరిత్రను తిరిగి రాస్తున్నారా?..NCERT 8వ తరగతి పుస్తకంపై తీవ్ర విమర్శలు

చరిత్రను తిరిగి రాస్తున్నారా?..NCERT 8వ తరగతి పుస్తకంపై తీవ్ర విమర్శలు

విద్యార్థులకు పాఠ్యాంశాలు నిర్ణయించే NCERT.. 2025 గాను విడుదల చేసిన కొత్త పుస్తకాలు వివాదాస్పదం అయ్యాయి. పాఠ్యపుస్తకాలసవరణలు, ముఖ్యంగా చరిత్రకు సంబంధించినవి గతంలోనూ వివాదం అయినప్పటికీ ఈ ఏడాది రిలీజ్ అయిన పుస్తకాల విషయంలో తీవ్ర వివాదానికి దారి తీసింది. 8వ తరగతి సోషల్ బుక్ లో మధ్యయుగ భారత దేశ చరిత్ర కు సంబంధించిన సవరణలు చరిత్రను వక్రీకరించేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని విడుదల చేసింది. ఇది మధ్యయుగ భారతీయ చరిత్రను వర్ణిస్తూనే చాలా మార్పులు చేశారని ఆరోపణలున్నాయి.  భోధనా భారాన్ని తగ్గించడం,అభ్యాస అనుభవాన్ని సరళీకరించడం అనే లక్ష్యాలతో పాఠ్యపుస్తకాలను NCERT సవరిస్తుంది. ఈ క్రమంలో 8వ తరగతి సోషల్ బుక్ లో పాఠ్యపుస్తకంలో మధ్యయుగ భారతీయ చరిత్ర మార్పులు చేర్పులు వివాదానికి దారి తీశాయి. సరళీకరణ ప్రక్రియ కొన్ని కీలక అంశాలను తొలగించడం లేదా  వాటి ప్రాముఖ్యతను తగ్గించేలా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. 

ALSO READ : గుడ్ న్యూస్: రూ. 56 వేల జీతంతో ఉద్యోగాలు..18 నుంచి 27 ఏళ్ల వారే అర్హులు

వివాదాస్పద అంశాలు,విమర్శలు..

NCERT పాఠ్యపుస్తకాల సవరణలపై ప్రధానంగా కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి..మొఘల్ చరిత్ర తొలగింపు లేదా తగ్గింపు..7వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల నుంచి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని అధ్యాయాలను తొలగించడం లేదా వాటి ప్రస్తావనను తగ్గించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మొఘలులు భారతదేశంలో 300 సంవత్సరాలకు పైగా పాలించారని, వారి పాలన భారతీయ సంస్కృతి, కళలు, వాస్తుశిల్పం, ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని చరిత్రకారులు వాదించారు. అలాంటి కీలకమైన భాగాన్ని తొలగించడం లేదా తగ్గించడం చరిత్రను వక్రీకరించడం అవుతుందని విమర్శించారు.

దేశీయ రాజవంశాల ప్రాధాన్యత..

పాఠ్యాంశాల సవరణలో ముఖ్యమైన విమర్శ ఏమిటంటే.. మొఘల్ చరిత్రను తగ్గటించి తద్వారా మరాఠాలు, రాజపుత్రులు, విజయనగర సామ్రాజ్యం మొదలైన దేశీయ రాజవంశాలు నాగరికత విజయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని విమర్శకులు అంటున్నారు. దీనిని కొందరు చారిత్రక సమతుల్యత అంటుండగా, మరికొందరు చరిత్రను తిరిగి రాయడమే అని మరికొంతమంది ఆరోపించారు.

కాషాయీకరణ ఆరోపణలు..

విద్యావ్యవస్థలో కాషాయీకరణ జరుగుతోందని చరిత్రకారులు,ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంటే పాఠ్యపుస్తకాలను ఒక వర్గం రాజకీయ లేదా మతపరమైన సిద్ధాంతానికి (హిందుత్వ) అనుగుణంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని వారు వాదించారు. ఇందులో భాంగా హిందూ మత నాయకులు ,హిందుత్వ భావజాలం ప్రాధాన్యతను పెంచడం కోసం చారిత్రక వాస్తవాలను తగ్గించడం లేదా తొలగించడం చేస్తున్నారని ఆరోపించారు.

జాతీయ వ్యతిరేక ఆరోపణలు.. గతంలో కొంతమంది చరిత్రకారులు రాసిన పాఠ్యపుస్తకాలు భారత వ్యతిరేక ,వ్యతిరేక"మైనవిగా ఉన్నాయని మరికొంతమంది అంటున్నారు. ముఖ్యంగా మధ్యయుగ కాలంలో ముస్లిం ఆక్రమణదారుల పట్ల తగినంత విమర్శనాత్మకంగా లేవని అలాగే హిందూ-ముస్లిం వైరుధ్యాలకు తిలక్, అరబిందో వంటి నాయకుల కారమణన్నట్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సవరణలు ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా ఉండవచ్చని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

NCERT,ప్రభుత్వ సమర్థన..

పాఠ్యాంశాల సరళీకరణపై, చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై NCERT,కేంద్ ప్రభుత్వం స్పందించింది. ఈ సవరణలను సమర్థించుకుంది. అవి కేవలం పాఠ్యాంశాల రెగ్యులర్ సవరణలో భాగమే అంటున్నాయి. విద్యార్థులపై బోధనా భారాన్ని తగ్గించడమే  NCERT లక్ష్యమని, విద్యార్థులను బోధన మరింత సులభతరం చేయడమే అంతిమ లక్ష్యమని చెబుతోంది. 

జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) సిఫార్సులకు అనుగుణంగా..విద్యార్థులకు స్కిల్స్ తో కూడిన విద్యను అందించేందుకు విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడానికి ఈ మార్పులు అవసరమని అంటోంది. ఇందులో భాగంగానే పునరావృతం అయ్యే అంశాల తొలగించినట్లు చెబుతోంది. నిపుణుల కమిటీల సిఫార్సులు: ఈ మార్పులు నిపుణుల కమిటీల సూచనలు ,విద్యావేత్తల సలహాల మేరకు జరుగుతాయని NCERT పేర్కొంది.

NCERT పాఠ్యపుస్తకాల సవరణలు, ముఖ్యంగా చరిత్రకు సంబంధించినవి, భారతదేశంలో ఎప్పుడూ ఒక సున్నితమైన అంశంగానే ఉంది. విద్యార్థులకు విద్యను మరింత సరళం చేసేందుకు, బోధనా భారం తగ్గించే లక్ష్యం వెనక..చారిత్రక వివరణలో రాజకీయ సైద్ధాంతిక మార్పులు జరుగుతున్నాయని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదం చరిత్రను ఎలా బోధించాలి..ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపై దేశంలో ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది.