పిల్లల హక్కుల రక్షణలో అప్రమత్తంగా ఉండాలి : సెక్రటరీ సంజీవ్ శర్మ

పిల్లల హక్కుల రక్షణలో అప్రమత్తంగా ఉండాలి : సెక్రటరీ సంజీవ్ శర్మ
  • అధికారులకు ఎన్‌‌సీపీసీఆర్ మెంబర్ సెక్రటరీ సంజీవ్ శర్మ  సూచన

హైదరాబాద్, వెలుగు: బాలల హక్కులను కాపాడటంలో  ప్రభుత్వ అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌‌సీపీసీఆర్) మెంబర్ సెక్రటరీ సంజీవ్ శర్మ అన్నారు. బాలల హక్కులపై సమాజంలో అవగాహన కల్పించడం ద్వారానే ఉల్లంఘనలను అరికట్టగలమని స్పష్టం చేశారు. 

ఆదివారం ఆయన హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌‌డీలో జరిగిన  ‘కీ చైల్డ్ రైట్స్ ఇష్యూస్’పై  రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో పాల్గొని, మాట్లాడారు. గత ఆరు నెలల్లోనే దేశవ్యాప్తంగా 26 వేల బాలల హక్కుల కేసులు పరిష్కరించామని, 2,800 మంది పిల్లలను ఆపదుకుని, మరో 1,800 మందిని సురక్షితంగా ఇంటికి చేర్చామని చెప్పారు.