కాన్‌బెర్రా: జార్జియా వోల్ (57 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 88), బెత్ మూనీ (39 బాల్స్‌లో 4 ఫోర్లతో 46) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విమెన్స్ జట్టు 19 రన్స్ తేడాతో ఇండియాపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ ఓడిన ఆసీస్ 20 ఓవర్లలో 163/5 స్కోరు చేసింది. స్టార్టింగ్ నుంచే ఇండియా బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనర్లు మూనీ, వోల్ తొలి వికెట్‌కు 121 రన్స్ జోడించారు. . అరుంధతి రెడ్డి 2 వికెట్ల తీసింది.
ఛేజింగ్‌లో ఇండియా 20 ఓవర్లలో 144/9 స్కోరుకే పరిమితమై ఓడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (36) టాప్ స్కోరర్. మంధాన (31), షెఫాలీ (29), రిచా ఘోష్ (19), క్రాంతి గౌడ్ (12) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. గార్డ్‌నర్ 3 వికెట్లు పడగొట్టింది. వోల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో టీ20 శనివారం అడిలైడ్‌లో జరుగుతుంది.
