బీహార్ ఎన్నికల ఫలితాలు.. కొనసాగుతున్న కౌంటింగ్..

బీహార్ ఎన్నికల ఫలితాలు.. కొనసాగుతున్న కౌంటింగ్..

బిహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ చేపట్టారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. 38 జిల్లాల్లోని 46 కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. బీహార్​ ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.  

 పోస్టల్​ బ్యాలెట్​ లో  63 స్థానాల్లో ఎన్డీయే మిత్రపక్షాలు, 34 స్థానాల్లో మహాఘట్‌ బంధన్‌ ముందంజలో ఉన్నాయి. రెండు స్థానాల్లో ప్రశాంత్‌ కిషోర్‌ జన్‌ సురాజ్‌ లీడ్‌లో ఉంది. అలీపూర్‌లో ముందంజలో మైథీలీ ఠాకూర్‌ లీడ్​లో ఉన్నారు.  తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్‌ మౌర్య, రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్‌ ఆధిక్యంలో ఉన్నారు.