వాగులోకి కొట్టుకుపోయిన లారీ…చెట్టును పట్టుకుని ఉన్న డ్రైవర్

వాగులోకి కొట్టుకుపోయిన లారీ…చెట్టును పట్టుకుని ఉన్న డ్రైవర్

సిద్దిపేట : భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిద్ధిపేట జిల్లా బస్వాపూర్ బ్రిడ్జి  పై నుంచి 2 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది తుమ్మదేవ వాగు. అయితే ఈ రోజు తెల్లవారు జామున అటుగా వెళ్తున్న లారీ అందులోపడి కొట్టుకుపోయింది. అందులో నుండి లారీ క్లీనర్ ధర్మయ్య సురక్షితంగా బయటపడ్డాడు. కానీ డ్రైవర్  డ్రైవర్ ముదిగొండ శంకర్(35) చెట్టును పట్టుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. శంకర్ ది అదిలాబాద్ జిల్లా కాశిరెడ్డి గ్రామం.

ఘటనపై వెంటనే చర్యలు చెప్పట్టాలని  జిల్లా కలెక్టర్, పొలీస్ కమిషనర్ , ఆర్డీవోలను ఆదేశించారు మంత్రి హరీష్ . రెస్క్యూ టీంను రప్పించి లారీ  డ్రైవర్ ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీష్  ఆదేశాలతో  పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ ఐపిఎస్ ఎన్డీఆర్ఎఫ్, హైదరాబాద్ రెస్క్యూ టీం అధికారులతో మాట్లాడి డ్రైవర్ ను  కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్  సిఐ రఘు ఎస్ఐ రాజా కుమార్ ,పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరంగల్ కరీంనగర్ సిద్దిపేట నుండి గజ ఈతగాళ్లను  రప్పించి వారితో  కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.