స్కూల్స్ ప్రారంభం : వారాల వ్య‌వ‌ధిలో 9వేల మంది స్కూల్ పిల్ల‌ల‌కు క‌రోనా

స్కూల్స్ ప్రారంభం :  వారాల వ్య‌వ‌ధిలో 9వేల మంది స్కూల్ పిల్ల‌ల‌కు క‌రోనా

స్కూల్స్ ఓపెన్ చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు భారీ ఎత్తున క‌రోనా వైర‌స్ సోకుతున్న‌ట్లు తెలుస్తోంది.

అమెరికాలో ఇప్ప‌టికే 5.79మిలియ‌న్ల మందికి క‌రోనా సోక‌గా…అందులో 1ల‌క్షా 78వేల మంది మ‌ర‌ణించారు. అక్క‌డ ఓ వైపు భారీ ఎత్తున కేసులు న‌మోదవుతున్నా కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. దీంతో వారాల వ్య‌వ‌ధిలో వేల సంఖ్య‌లో స్కూల్ పిల్ల‌ల‌కు క‌రోనా సోకిన‌ట్లు ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్ మెంట్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది.

ఆ నివేదిక ప్ర‌కారం 18ఏళ్ల లోపు వ‌య‌సున్న 48,730 మంది పిల్ల‌ల‌కు క‌రోనా సోకిన‌ట్లు నివేదిక‌లో పేర్కొన్నారు. ఆగస్టు 9న విడుదల చేసిన నివేదికలో 39,735 మంది పిల్ల‌ల‌కు సోక‌గా.. స్కూల్స్ ప్రారంభం కావ‌డంతో గత రెండు వారాల్లో 8,995 కేసులు న‌మోద‌య్యాయి.

ఆరోగ్య‌శాఖ అధికారులు విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం 14 నుంచి 17 ఏళ్ల వ‌య‌సున్న‌ 17,311 మంది పిల్ల‌ల‌కు క‌రోనా సోకిన‌ట్లు ధృవీకరించారు. 5 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలు 27 శాతం మందికి క‌రోనా సోకిన‌ట్లు ఫ్లోరిడా ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక‌లో పొందుప‌రిచారు.