
రెగ్యులర్‌గా వాకింగ్ చేసేవాళ్లకు అప్పుడప్పుడు పాదాల్లో నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు దీనిపై కాసేపు నిలబడితే చాలు.. నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. మిక్సెన్ అనే కంపెనీ ఈ ఆటోమెటిక్ ఎలక్ట్రిక్ ఫుట్ మసాజర్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది వైబ్రేట్అవుతూ పాదాలకు వేడిని ఇస్తుంది. దానివల్ల నొప్పి తగ్గడంతోపాటు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. వైబ్రేషన్ లెవల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
పాదాలు చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా సౌకర్యవంతంగానే ఉంటుంది. ఈ మసాజర్‌లో ఈఎంఎస్ టెక్నాలజీ వాడారు. అది కండరాల నొప్పి తగ్గించడంలో సాయపడుతుంది. ఇది పోర్టబుల్ సైజులో ఉండడమే కాకుండా ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది. మడతపెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ధర : రూ. 1,999
మెడ నొప్పికి..
ఈ మధ్య కాలంలో డెస్క్ జాబ్ చేసే చాలామంది నడుము, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. గంటల తరబడి ఆఫీసుల్లో కూర్చోవడం వల్ల మెడ నొప్పి కూడా కామన్ అయిపోయింది. అలాంటి వాళ్లు ఈ మసాజర్‌ని వాడితే నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. ఫ్లిక్సీఫై అనే కంపెనీ ఈ మసాజర్‌ని తీసుకొచ్చింది. దీంతో నడుము, భుజాలు, మెడ భాగంలో మసాజ్ చేసుకోవచ్చు. దీనికి ఆరు మసాజ్ హెడ్స్ ఉంటాయి.
మసాజ్ చేసుకునే పార్ట్‌ని బట్టి మోడ్స్ మార్చుకోవాలి. మెడ నొప్పిని తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫెషనల్ మసాజర్ ఇది. ఇందులో హీట్ ఫంక్షన్ కూడా ఉంది. రెండు హీట్ కంప్రెస్ సెట్టింగ్స్ ఉన్నాయి. దీన్ని ఆన్ చేసిన 10 నిమిషాల్లో మసాజ్ పూర్తి చేసి ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఇది రీచార్జబుల్ లిథియం–అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. కాబట్టి ఉపయోగించిన ప్రతిసారి కరెంట్‌కి ప్లగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే చార్జ్‌పై 70–80 నిమిషాల వరకు మసాజ్ చేస్తుంది. ధర : రూ. 1,499