సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి కావాలి : లింబాద్రి

సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి కావాలి : లింబాద్రి

ఓయూ,వెలుగు: తెలంగాణ సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా కావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో  నిర్వహించిన మూడు రోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ  తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరేందుకు తగిన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు.  రాష్ట్రంలో అణగారిన, వెనకబడిన వర్గాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, దళిత, -గిరిజన అభివృద్ధి మొదలైన అంశాలు చూడాల్సి ఉంటుందన్నారు. 

 జాతీయ సదస్సు డైరెక్టర్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  గ ణేష్  మాట్లాడుతూ.. సదస్సులో పరిశోధన పత్రాలు,  డిబేట్స్ డిస్కషన్ అన్నింటినీ క్రోడీ కరించి తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.  కార్యక్రమంలో ఓయూ సోషల్ సైన్స్ డీన్  ప్రొఫెసర్  కె. అర్జున్ రావు,  సోషియాలజీ బీఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ పి .విష్ణుదేవ్,  జాతీయ సదస్సు కో– డైరెక్టర్  డాక్టర్ బీనవేణి  రామ్ షెఫర్డ్,  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.