
మెహిదీపట్నం, వెలుగు: నీలోఫర్ దవాఖానను టైఫాయిడ్ పరిశీలన కోసం ప్రధాన నోడల్ కేంద్రంగా గుర్తించారు. ఈ కేంద్రాన్ని మంగళవారం డబ్ల్యూహెచ్వో రాష్ట్ర వైద్యాధికారి డాక్టర్ మురారి ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాక్ టెక్ కల్చర్ బాటిల్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుచిత్ర, ప్రొఫెసర్ డాక్టర్ కవిత, డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ పాల్గొన్నారు.