
బాలీవుడ్ నటి నీనా గుప్తా కీలక విషయాలను వెల్లడించారు. -ఓ లిప్ కిస్ సీన్ లో నటించిన తరువాత తన నోరును డెటాల్ తో శుభ్రం చేసుకున్నానని తెలిపింది. లస్ట్‌స్టోరీస్ 2 సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఆన్ స్ర్కీన్ లిప్ కిస్ అనుభవాన్ని భయటపెట్టింది.
కొన్నేళ్ల క్రితం దిలీప్ ధావన్‌తో తానొక సీరియల్‌లో నటించనని, అందులోని ఓ సన్నివేశంలో తమపై లిప్ టు లిప్ కిస్ సీన్ ను చిత్రీకరించారని నీనాగుప్తా తెలిపింది. భారత టెలివిజన్ చరిత్రలో అదే మొట్ట మొదటి లిప్ కిస్ సీన్ అని ఆమె చెప్పుకొచ్చింది. నటి అయినప్పుడు అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది కాబట్టి తనకు తాను నచ్చజెప్పుకుని ముందుకు అడుగువేశానని వెల్లడించింది. ఆ సీన్ పూర్తైన వెంటనే డెటాల్‌తో తన నోరు శుభ్రం చేసుకున్నానని, అది తనకెంతో కష్టంగా అనిపించిందని నీనాగుప్తా తెలిపింది.
సినిమాలతోనే కాకుండా సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు నీనా గుప్తా. ఇప్పుడు లస్ట్‌స్టోరీస్ 2 లో కీలక పాత్రలో నటించింది. తమన్నా, మృణాల్ ఠాకూర్ , విజయ్ వర్మ కీలక పాత్రాల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ 2023 జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. నాలుగు విభిన్నమైన కథలతో ఇది తెరకెక్కింది.