డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్ కు స్వర్ణం

 డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్ కు స్వర్ణం

ఒలంపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరిగిన డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లో స్వర్ణం సాధించాడు. దీంతో  డైమండ్‌ లీగ్‌లో టైటిల్‌ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్రలోకి ఎక్కాడు. తొలి ప్రయత్నంలోనే 89.08 మీటర్లు విసిరి అందరికంటే ముందంజలో నిలిచిన నీరజ్... . ఆ తరువాత రెండు, మూడు ప్రయాత్నలలో 85.18 మీటర్లు, 80.8 మీటర్లు, విసిరి స్వర్ణం సాధించాడు.అయితే అతనికి దరిదాపుల్లో కూడా ఎవరూ విసరకపోవడం గమనార్హం. అలాగే వచ్చేఏడాది బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ బెర్తును నీరజ్ ఖరారు చేసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇలాంటి ఫలితం రావడం తనకు ఆనందంగా ఉందంటూ నీరజ్ ట్వీట్ చేశాడు.