ప్రశాంతంగా నీట్  ఎగ్జామ్

ప్రశాంతంగా నీట్  ఎగ్జామ్

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన నీట్- ఎగ్జామ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని  రెండు సెంటర్లలో  937 మంది అభ్యర్థులకు 916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.  కలెక్టర్  హైమవతి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సెంటర్ కు చేర్యాలకు చెందిన ఓ విద్యార్థిని ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకోగా, అప్పటికే గేట్  మూసి వేయడంతో పరీక్షకు అనుమతించలేదు.

మెదక్:  పట్టణంలోని  నీట్​ ఎగ్జామ్  కు  479 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 465 హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని అడిషనల్​ కలెక్టర్  నగేశ్, మెదక్  ఆర్డీవో రమాదేవి పరిశీలించారు.

గద్వాల, వెలుగు: జిల్లాలో నాలుగు ఎగ్జామ్స్ సెంటర్లను ఏర్పాటు చేయగా మొత్తం 930 మంది అభ్యర్థులకు   911 మంది అభ్యర్థులు హాజరై ఎగ్జామ్స్ రాసినట్లు నీట్ సిటీ కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ శంకర్, డీఎస్పీ  మొగులయ్య భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.  
మహబూబ్ నగర్ టౌన్ :   పాలమూరు యూనివర్శిటీ. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్స్ ను ఆదివారం ఎస్పీ డి.జానకి, అడిషనల్ కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ  తనిఖీ చేశారు.  ఎగ్జామ్ సెంటర్స్ లో ఎగ్జామ్ నిర్వహణ, సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 

నల్గొండ:  జిల్లాలో  6 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 2038 మంది విద్యార్థులకు  1985 మంది హాజరవ్వగా 53 మంది రాలేదు.   సూర్యాపేటలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 887 మంది పరీక్ష రాశారు.నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష నిర్వహణను పరిశీలించారు.