నీట్, JEE మెయిన్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..

నీట్, JEE మెయిన్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెయిన్ (JEE మెయిన్) 2024, నేషనల్ ఎలిజిబిలిటీ -కమ్ -ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG) 2024, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) UG ,  PG 2024 పరీక్ష తేదీలను ప్రకటించింది. NTA అధికారిక వెబ్ సైట్ nta.ac.inలో వివరాలు ఉన్నాయి.  

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకారం.. JEE మెయిన్ పరీక్షను జనవరి, ఏప్రిల్ లో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. 2024 మే నెలలో NEET  ఎగ్జామ్, CUET UG 2024  ఎగ్జామ్,  జూన్ లో UGC NET పరీక్షలు నిర్వహించనున్నారు.

JEE మెయిన్ ఫలితాలను పరీక్ష నిర్వహించిన మూడు వారాల్లో ప్రకటిస్తామని NTA తెలిపింది. మెడికల్ ప్రవేశ పరీక్ష, నీట్ ఫలితాలు జూన్ రెండో వారంలో వెల్లడికానున్నాయి.

JEE మెయిన్, నీట్, CUET, UGC నెట్2024 పరీక్ష షెడ్యూల్ 

JEE మెయిన్ 2024:  సెషన్ 1:  -2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు 

JEE మెయిన్ 2024 సెషన్ 2-:  2024 ఏప్రిల్ 1, నుంచి ఏప్రిల్ 15వరకు 

NEET UG 2024 -:  మే 5, 2024

CUET UG 2024 -: మే 15, 2024 నుంచి మే 31, 2024 వరకు 

CUET PG 2024 -: మార్చి 11నుంచి మార్చి 28 వరకు 

UGC-NET సెషన్ I :- 2024 జూన్ 10  నుంచి జూన్ 21 వరకు