NEET PG 2025: జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా

NEET PG 2025: జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా

న్యూఢిల్లీ: జూన్ 15న నిర్వహించాల్సి ఉన్న నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఎన్బీఈ (National Board of Examinations in Medical Sciences) ప్రకటన విడుదల చేసింది. నీట్ పీజీ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్బీఈ తెలిపింది. నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల ఏర్పాటు కోసం నీట్ పీజీ పరీక్షను ఎన్బీఈ వాయిదా వేసింది.

ఎంబీబీఎస్‌ సహా యూజీ- వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ (NEET) పరీక్ష విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. నీట్-2025 పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో కాకుండా పెన్ అండ్ పేపర్‌ (ఓఎంఆర్)  పద్దతిలో నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.

ఒకే రోజు, ఒకే ఫిష్ట్‎లో దేశమంతటా నీట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. 2024లో నీట్ పరీక్ష పత్రాల లీకేజీ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి అలాంటి ఘటనలు  చేసుకోకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పరీక్ష నిర్వహణలో ఈ మార్పులు చేసింది.