'బింబిసార' నుంచి మరో పాట వచ్చేసింది

 'బింబిసార' నుంచి మరో పాట వచ్చేసింది

టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బింబిసార'. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందింది. కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నుండి వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు. 

'నీతో ఉంటే చాలు' అంటూ ఈ ఎమోషనల్ సాంగ్ సాగుతోంది. ఈ పాటకు కీరవాణి సాహిత్యాన్ని అందించి.. ఆయనే స్వరపరిచారు. మోహన భోగరాజు, శాండిల్యలు పాడారు. ఇందులో రాజుగా, సాధారణ యువకుడిగాను కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ లో నిర్మించాడు. చారిత్రక నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ ను జోడించి ఒక కొత్త జోనర్లో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తే, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు.