
డీజే టిల్లు హిట్ తో హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సిద్ధూ జొన్నలగడ్డతో అమ్మడు కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పేలింది. ప్రియుడిని చంపేసి ఆ కేసులో కూల్ గా కొత్త లవర్ ని ఇరికించిన పాత్రలో సరిగ్గా ఒదిగిపోయింది. అయితే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో నేహ ఎందుకు లేదనే విషయం హీరోకు దర్శకుడికే తెలియాలి. టిల్లు స్క్వేర్ లో తన స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. ఎనిమిదేళ్ల క్రితం కన్నడలో తెరంగేట్రం చేసిన నేహాకి టిల్లు సక్సెస్ ఆఫర్ల వర్షం కురిపించలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలూ రాలేదు. ట్విస్టేంటంటే ఒక్క పాటతో ఈ మధ్య నేహా శెట్టి సోషల్ మీడియా ట్రెండ్స్ లో బాగా నానుతోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న రూల్స్ రంజన్ నుంచి ఇటీవలే చూసేయ్ చూసేయ్ పాట విడుదలైంది. ట్యూన్ చాలా క్యాచీగా ఉండటంతో పాటకు నేహా శెట్టి వయ్యారాలు ఒలికించిన తీరు సోషల్ మీడియాలో విపరీతమైన రీచ్ తెచ్చుకుంటోంది. లిరికల్ వీడియోలో ఈమెను చూస్తున్న జనాలు పక్కన హీరో ఉన్న సంగతే మర్చిపోతున్నారు. అంత గా ఈ సాంగ్ ఎక్కేసింది.
డీజే టిల్లుకు ముందు గల్లీ రౌడీ మూవీలో హీరోయిన్‌గా నటించగా.. అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో ఓ చిన్న రోల్ ప్లే చేసింది ఈ భామ. ప్రస్తుతం నేహా రూల్స్ రంజన్, కార్తికేయ హీరోగా నటిస్తున్న బెదురులంక 2012 అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇందులో చిత్ర అనే అమ్మాయి రోల్ పోషిస్తోంది. ఇక తన అందంతో మెస్మరైజ్ చేసే భామ.. ఈ రెండు మూవీస్ తో ఎలాంటి క్రేజీ సొంతం చేసుకుంటుందో చూడాలి.