గుండెపోటుతో నేన్నల్ మండలం తహసీల్దార్ మృతి

గుండెపోటుతో  నేన్నల్ మండలం తహసీల్దార్ మృతి

ఈ మధ్య గుండెపోట్లు భయాంధోనకు గురిచేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడుస్తున్నారు. ఈ మధ్యకాంలోనే చాలామంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు.

  తాజాగా మంచిర్యాల జిల్లా నేన్నల్ మండలంలో తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ జ్యోతి(52)ఆగస్టు5న  రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.  ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినపట్టి నుంచి పనిలో ఒత్తిడి ఒత్తిడి పెరిగిందని అందుకే గుండెపోటుతో మృతి చెందిందని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇటీవలే జూన్ 6న  గుండెపోటుతో హనుమకొండ తహసీల్దార్​ కర్ర శ్రీపాల్ రెడ్డి  చనిపోయారు.