నేపాల్ భూకంప బాధితులకు అండగా ఉంటాం.. పీఎం తీవ్ర విచారం

నేపాల్ భూకంప బాధితులకు అండగా ఉంటాం.. పీఎం తీవ్ర విచారం

నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా నేపాల్‌కు మద్దతును అందించారు. సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని సుముఖత వ్యక్తం చేశారు.

నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, నేపాల్ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తోందని చెప్పారు. అన్ని ర‌కాలుగా ఆ దేశాన్ని ఆదుకుంటామ‌న్నారు. బాధిత కుటుంబాలకు ఆయ‌న సంతాపం వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డ్డ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

నవంబర్ 3న అర్థరాత్రి నేపాల్‌లో సంభవించిన 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 128 మంది మరణించగా, కనీసం 141 మంది గాయపడ్డాడరు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రకటన వెలువడిందని ఖాట్మండు పోస్ట్ నివేదించింది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ భూకంప ప్రభావిత ప్రాంతాల సందర్శనకు బయలుదేరారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) జజర్‌కోట్, వెస్ట్ రుకుమ్‌లు అత్యధికంగా నష్టపోయాయని, జాజర్‌కోట్‌లో 92 మరణాలు నమోదయ్యాయని జాజర్‌కోట్ జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ రోకా తెలిపారు. బాధితుల్లో నల్గాడ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ కూడా ఉన్నారని రోకా చెప్పారు.