
సిటీలో నేపాల్ ముఠాలు వరుస చోరీలకు పాల్పడుతున్నాయి. ఇటీవలే రాయదుర్గంలో ఓ ముఠా భారీ చేయగా.. నిన్న నాచారం పీఎస్ పరిధిలో మరో నేపాల్ ముఠా భారీ చోరి చేసింది. ఓ ఇంట్లో రూ.10 లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యింది. చోరీ చేసింది పనిమనుషులు అర్జున్, రియాగా గుర్తించారు పోలీసులు. అసలేం జరిగిందంటే.. 14 రోజుల క్రితం నేపాల్ కు చెందిన రియా, అర్జున్ ఓ ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఇంటి యజమాని అతని భార్య శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి రూ. 10 లక్షల నగదు, 20 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యారు. ఇంటి యజమాని ప్రదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేపాల్ దొంగల కోసం సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సరిహద్దులు, రైల్వే స్టేషన్ల వద్ద వెతుకుతున్నారు.