కొత్త మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గని నేపాల్

కొత్త మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గని నేపాల్

ఖాట్మండూ : ఇండియా లో లిపులేఖ్‌, లింపియధుర, కాలాపానీ ప్రాంతాలు  నేపాల్‌ భూభాగంలో ఉన్నట్లు రూపొందించిన మ్యాప్ విషయంలో నేపాల్ వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయంలో మనదేశం తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ అక్కడి ప్రభుత్వం లెక్క చేయటం లేదు. కొత్త మ్యాప్  కు ఆమోదం తెలిపేందుకు అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ  రాజ్యాంగ సవరణ కు సిద్ధమైంది. ఆదివారం ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో టేబుల్ చేసింది.  లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ శివమయ తుంబహాంగ్పే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు శనివారమే ప్రకటించటంతో బిల్లుపై నేపాల్ చర్యలు మొదలుపెట్టింది. కొత్త మ్యాప్ కు ఆమోదం తెలుపాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ప్రధాని అభ్యర్థనతో నేపాలీ కాంగ్రెస్ సహా సమాజ్ వాదీ పార్టీ నేపాల్, రాష్ట్రీయ జనతా పార్టీ నేపాల్ కూడా బిల్లుకు ఓకే చెప్పాయి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాత ప్రెసిడెంట్ ఆర్డర్ తో కొత్త మ్యాప్ కు గ్రీన్ సిగ్నల్ రానుంది. దీంతో  లిపులేఖ్‌, లింపియధుర, కాలాపానీ ప్రాంతాలు నేపాల్‌ భూభాగంలో ఉన్నట్లు ఆ దేశం ప్రకటించుకోనుంది. ఈ చర్య వెనుక చైనా హస్తం ఉన్నట్లు మనదేశం భావిస్తోంది. .

రోడ్డు నిర్మాణంతో మొదలైన వివాదం

మే 8 న ఉత్తరాఖండ్ నుంచి మానససరోవర్ మనదేశం 80 కిలోమీటర్ల కొత్త రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఫితోర్ ఘర్ జిల్లాలోని ధార్చుల నుండి లిపులేఖ్ (చైనా సరిహద్దు) ను కలుపుతూ రహదారి మార్గాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్  ప్రారంభించారు. దీనిపై నేపాల్ అభ్యంతరం మొదలుపెట్టింది. లిపులేఖ్ మాదేనని తెలిపింది.

లాక్ డౌన్ 4.0 లోనే సగం కరోనా కేసులు