ఖాట్మండ్: విశ్వాస తీర్మానం పరీక్షలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఓడిపోయారు. సోమవారం పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయనకు అనుకూలంగా 93 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 124 మంది ఓటు వేశారు. 275 మంది సభ్యులున్న నేపాల్ పార్లమెంటులో 15 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓలి గెలవడానికి 136 ఓట్లు రావాల్సి ఉండగా 124 మందే ఓటు వేయడంతో విశ్వాసం కోల్పోయారు. ఓలీ ప్రభుత్వానికి ప్రచండ వర్గం(పీపీఎన్ మావోయిస్ట్ సెంటర్) తన మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ నేత ప్రచండ ప్రకటన చేశారు. పార్లమెంటులో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రధాని ఓలి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల గురించి ఓలీ వివరించినా ఓటమి తప్పలేదు.
