ఇండియాకు అప్‌డేటెడ్‌ మ్యాప్‌ను పంపనున్న నేపాల్

ఇండియాకు అప్‌డేటెడ్‌ మ్యాప్‌ను పంపనున్న నేపాల్

న్యూఢిల్లీ: నేపాల్–ఇండియా సంబంధాలు ఇటీవల కొంత దెబ్బతిన్నాయి. ఇరు దేశాల బార్డర్‌‌లోని లిపులేఖ్​, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తమ దేశంలోకే వస్తామని నేపాల్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. దీనిక తోడుగా ఆయా ప్రాంతాలను తమ దేశ కొత్త మ్యాప్‌లో చూపుతూ నేపాల్ ప్రధాని ఓలి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం రివైజ్డ్‌ మ్యాప్‌ను ఇండియాకు పంపనుందన్న వార్త ఆసక్తిని కలిగిస్తోంది.

నేపాల్ సర్కార్ తమ దేశ రివైజ్డ్‌ మ్యాప్‌ను ఇండియాతోపాటు యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఈ నెల రెండో వారంలో పంపనుందని నేపాల్ మినిస్టర్ పద్మ అర్యాల్ తెలిపారు. ‘కాలాపానీ, లిపూలేఖ్, లింపియాధురలను చేర్చుతూ రూపొందించిన రివైజ్డ్‌ మ్యాప్‌ను వివిధ యూఎన్ ఏజెన్సీలతోపాటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఇండియాకు పంపనున్నాం. ఈ నెల రెండో వారంలో ఈ ప్రాసెస్ ముగుస్తుంది’ అని మినిస్టర్ ఆఫ్​ ల్యాండ్ మేనేజ్‌మెంట్, కోఆపరేటివ్స్ అండ్ పోవర్టీ అలెవేషన్ పద్మ అర్యాల్ స్పష్టం చేశారు.