
- ఎక్కువసార్లు ఎక్కిన ట్రెక్కర్గా రికార్డు
ఖాట్మండు: నేపాలీ షెర్పా, ప్రఖ్యాత పర్వతారోహకుడు కామి రీటా ఎవరెస్టు శిఖరాన్ని 31వ సారి అధిరోహించి చరిత్ర సృష్టించారు. అత్యధిక సార్లు ఎవరెస్టును ఎక్కిన ట్రెక్కర్గా రికార్డు నెలకొల్పారు. గతంలో తన పేరిట ఉన్న రికార్డును తానే బద్ధలు కొట్టారు. లెఫ్టినెంట్ కర్నల్ మనోజ్ జోషి నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్ ఎవరెస్ట్ యాత్ర బృందానికి కామి రీటా మార్గనిర్దేశం చేశారు.
మంగళవారం ఉదయం 4 గంటలకు మౌంట్ ఎవరెస్టును కామి రీటా అధిరోహించారని యాత్ర నిర్వాహకుడు, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్మన్ మింగ్మా షెర్పా తెలిపారు.