
న్యూఢిల్లీ: ఐపీఓకు సిద్ధమవుతున్న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ కార్యకలాపాలను విస్తరించింది. ఈ సంస్థకు భారత్, నేపాల్, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్‌లలో 500 క్లినిక్స్ ఉన్నాయి. సంవత్సరానికి 33 వేల మంది రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా నిధులు సమీకరించడానికి ఈ ఏడాది జులైలో సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్‌ను దాఖలు చేసింది. నెఫ్రోప్లస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 755.81 కోట్ల మొత్తం ఆదాయాన్ని సంపాదించింది. నికర లాభం కూడా మునుపటి ఆర్థిక సంవత్సరం రూ. 35.13 కోట్ల నుంచి రూ. 67.1 కోట్లకు పెరిగింది.
ఐపీఓలో రూ. 353.4 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లు 1.27 కోట్ల షేర్ల ఓఎఫ్‌ఎస్ ఉంటుంది. ఐపీఓ డబ్బులో సుమారు రూ. 129 కోట్లను 2028 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో 167 కొత్త డయాలసిస్ కేంద్రాలను తెరవడానికి ఉపయోగిస్తారు.