బీఆర్ఎస్‌‌‌‌లో చేరిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి

బీఆర్ఎస్‌‌‌‌లో చేరిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి

కోనరావుపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడలక్ష్మీ నరసింహరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెతోపాటు ధర్మారం సర్పంచ్ గున్నాల అరుణ,లక్ష్మణ్  సైతం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి చల్మెడ, జడ్పీ చైర్ పర్సన్ అరుణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జ్యోతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నీ పార్టీలతో పోలిస్తే ఉద్యమ పార్టీగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా బీఆర్ఎస్‌‌‌‌ గుర్తింపు పొందిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలంటే అది బీఆర్ఎస్‌‌‌‌తో సాధ్యమని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరానన్నారు. కార్యక్రమంలో లీడర్లు మల్యాల దేవయ్య, గోపాల్ రావు, ప్రశాంత్, ఎల్లయ్య, శివంగలపల్లి సర్పంచ్ సురేశ్​యాదవ్ పాల్గొన్నారు.