ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 10.64 లక్షల కోట్లు

ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 10.64 లక్షల కోట్లు

న్యూఢిల్లీ:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలలో (బీఈ) 58.34 శాతానికి చేరి రూ. 10.64 లక్షల కోట్లుగా ఉన్నాయి.  ఏప్రిల్–-నవంబర్ మధ్యకాలంలో నికర పన్ను వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23.4 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

రీఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను జారీ చేయడానికి ముందు స్థూల సేకరణలు 17.7 శాతం పెరిగి రూ.12.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జారీ అయిన రీఫండ్ల విలువ రూ. 2.03 లక్షల కోట్లు ఉంది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 18.23 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ. 15.38 లక్షల కోట్లు వసూలవుతాయని అంచనా.