
- లై క్వార్టర్లో 18 నెలల గరిష్ట స్థాయికి
- హైదరాబాద్‌లో డిమాండ్ డౌన్
- ముంబైలోనూ గిరాకీ తక్కువే
- వెల్లడించిన జేఎల్ఎల్ రిపోర్ట్
న్యూఢిల్లీ: మనదేశంలోని ఏడు మెట్రో నగరాల్లో జులై–-సెప్టెంబర్ మధ్య ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 5 శాతం పెరిగి 10.37 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. రియల్ఎస్టేట్కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు ఉన్నప్పటికీ ఈ ఏడు నగరాల్లో బిజినెస్ తగ్గలేదు.
గత సంవత్సరం ఇదే కాలంలో ఆఫీస్ స్పేస్ అమ్మకం 9.86 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంది. గత 18 నెలల్లో ఇదే అత్యధికమని జేఎల్ఎల్ ఇండియా హెడ్ ఆఫీస్ లీజింగ్ అడ్వైజరీ రాహుల్ అరోరా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారతదేశ ఆఫీస్ మార్కెట్ పనితీరు, డిమాండ్ బాగుందని అన్నారు.
బలమైన ఫండమెంటల్స్ ఇందుకు కారణమని చెప్పారు. జులై క్వార్టర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు మొత్తం ఆఫీస్ స్పేస్ 44 శాతాన్ని కొన్నాయని, మిగతా దేశాల వాటికంటే భారతీయ ఆఫీసు మార్కెట్లలో వృద్ధి బాగుందని ఆయన వివరించారు.
ఏయే నగరంలో ఎంతంటే..
1. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ జులై–-సెప్టెంబర్లో 1.71 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2.38 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.
2. చెన్నైలో ఇది 0.54 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.9 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.
3. ఢిల్లీ–-ఎన్‌సిఆర్‌లో ఆఫీస్ స్పేస్ అమ్మకం 1.61 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.7 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.
4. పూణేలో, డిమాండ్ 1.01 మిలియన్ చదరపు అడుగుల వద్ద స్థిరంగా ఉండగా, కోల్‌కతాలో లీజింగ్ 0.10 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.14 మిలియన్ చదరపు అడుగులకు స్వల్పంగా పెరిగింది.
5. హైదరాబాద్, బెంగళూరులో డిమాండ్ తగ్గింది. హైదరాబాద్ నెట్ ఆఫీస్ లీజింగ్ 3.06 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2.7 మిలియన్ చదరపు అడుగులకు పడింది.
6. ముంబైలో ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 2022 జులై–-సెప్టెంబర్లో 1.83 మిలియన్ చదరపు అడుగుల నుంచి ఈ క్యాలెండర్ సంవత్సరంలో మూడవ క్వార్టర్లో 1.53 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.