
మామూలుగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉన్నవాళ్లు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్‌కి ఇలా తెలిసినవాళ్లెవరైనా పాస్వర్డ్ అడిగితే షేర్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు అలా కుదరదు. ఎందుకంటే.. ‘నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ అనేది ఒక ఫ్యామిలీకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇతరులకు షేర్ చేయాలంటే షరతులు వర్తిస్తాయి’ అంటోంది కంపెనీ. మొదట్లో 2017లో పాస్వర్డ్ చేసుకోవచ్చని చెప్పిన కంపెనీ ఇప్పుడు దానిపై కొన్ని రూల్స్ పెట్టింది.
ఎక్స్ట్రా నెట్‌ఫ్లిక్స్ స్లాట్ కోసం కొంత డబ్బు కట్టాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సహా వందకు పైగా దేశాలు, భూభాగాల్లో ఉన్న కస్టమర్స్‌కి ఈ–మెయిల్ పంపిస్తున్నట్టు తెలిపింది కంపెనీ. ఈ మెయిల్ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఒక ఇంటికి మాత్రమే వాడాలి. ఇంటి సభ్యులు కాకుండా వేరే వ్యక్తికి షేర్ చేయాలంటే ఎక్స్ట్రా మనీ కట్టాలి. ఇతరులకు కూడా వాళ్ల సొంత పాస్వర్డ్, ప్రొఫైల్ ఉండాలి. కానీ, చేరడానికి ఇన్వైట్ చేసిన వాళ్లే ఆ డబ్బు చెల్లించాలి.
అయితే, ఇతరుల అకౌంట్‌తో ఒకేసారి ఒక డివైజ్‌లో కంటెంట్‌ను మాత్రమే చూడగలరు లేదా డౌన్లోడ్ చేసుకోగలరు. అకౌంట్‌కి సైన్ ఇన్ చేసిన డివైజ్ నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌లో భాగమో కాదో తెలుసుకోవడానికి ఐపీ అడ్రస్, డివైజ్ ఐడీ, అకౌంట్ ప్రోగ్రెస్ వంటి ఇన్ఫర్మేషన్తో పాటు డివైజ్ జీపీఎస్ డేటాను కూడా సేకరించిందట. ఒకవేళ హౌస్‌హోల్డ్ సెట్ చేయకపోతే, అడ్రస్‌లు కంపెనీయే ఆటోమేటిక్‌గా ఒకదాన్ని సెట్ చేస్తుంది. ఇంటర్నెట్కి కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ చేయడం వల్ల టీవీ నుంచి నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ని ఎప్పుడైనా అప్డేట్ చేయొచ్చు.