కూకట్ పల్లిలో నేటి స్త్రీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 3K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం బిజీ లైఫ్ కు అలవాటు పడి జనాలు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ యాంత్రిక జీవితంలో ప్రజలు వారి ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.
Also Read :- మోదీ రష్యా టూర్
ఈ యాంత్రిక జీవిత విధానంలో డైలీ కనీసం అరంగంట వాకింగ్ చేయాలన్నారు. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్దాలు మాత్రమే తినాలని.. వ్యాయామం చేయాలన్నారు. నిత్యం వాకింగ్ చేస్తే శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యం చేకూరి.. ఎంతో ఉల్లాసంగా... ఉత్సాహంగా ఉంటారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో నేటిస్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, నిర్వాహకులు దేవిరెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.