మోడీ,అమిత్ షా పై ప్రశంసల జల్లు

మోడీ,అమిత్ షా పై ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై సోషల్  మీడియాలో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. మోడీ, అమిత్ షాలపై ప్రశంసల జల్లు కురిపించారు. కొందరుసర్కారు నిర్ణయాన్ని అభినందిస్తుండగా.. మరికొందరు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేస్తే అక్కడభూములు కొనొచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మోడీ, షాలను ఉద్దేశించి రకరకాల మీమ్స్ క్రియేట్చేసి, ట్వి ట్ చేస్తున్నారు. ‘ఆయన మనకిచ్చిన మాటనిలబెట్టుకున్నారు’ (హి ప్రామిస్డ్. హి డెలివర్డ్)..‘శాంతంగా ఉండండి, ఆయనపై నమ్మకముంచండి’ అంటూ రాసి ఉన్న అమిత్ షా ఫొటో ట్వి ట్టర్ లోవైరలైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని పవిత్రమైన గంగాజలంతో పోల్చాడో నెటిజన్.. మరో యూజర్ ‘జాలీఎల్ఎల్ బీ 2’ పోస్టర్, దానిపై మోడీ ఫొటో, కిందభారతీయులు మోడీని చూస్తూ.. అన్నీ సా హసోపేతనిర్ణయాలే తీసుకుంటున్నారు అంటున్నట్లు తయారుచేసి ట్వీట్ చేశారు. మరోదాంట్లో .. మాజీ ప్రధానిజవహర్ లాల్ నెహ్రూ ఆర్టికల్ 370 ని చెత్తబుట్టలోపడేస్తున్నట్లు మీమ్ చేశారు. మరో యూజర్.. ఊళ
పెడుతున్న నక్కల ఫొటోను షేర్ చేస్తూ, ఆర్టికల్ 370రద్దు అంశంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ పరిస్థితి ఇదేనంటూ కామెంట్ చేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం విని కాశ్మీర్ లో భూములకొను గోలు కోసం రాబర్ట్ వాద్రా అక్కడికి పయనమయ్యాడంటూ మరో మీమ్ చక్కర్ లు కొడుతోంది.కాశ్మీర్ లో భూమి కొనేందుకు నేను , మా బాస్ బయలుదేరామంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు.

  • ఇది చారిత్రక ఘట్టం ,ఎన్డీయే సర్కారు సా హసోపేత నిర్ణయం..మాధుర్​భండార్కర్, డైరెక్టర్
  • దేశ సమైక్యత కోసం ప్రాణాలొడ్డిన వారికిఈ నిర్ణయం గొప్ప నివాళి, ప్రధాని, హోంమంత్రికి ధన్యవాదాలు.. వివేక్ ఒబెరాయ్
  • ఉగ్రవాద రహితంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రధాని మోడీ సత్తా ఉన్న నాయకుడు.జమ్మూకాశ్మీర్ సహా దేశ ప్రజలందరికీ శుభాకాం క్షలు.. కంగనా రనౌత్
  • భివృద్ధి మార్గంలో కాశ్మీర్ ప్రజల తొలిఅడుగు.. భవిష్యత్తు లో కాశ్మీర్ అభివృద్ధిలోముందుంటుంది.. దియా మీర్జా
  • ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. మోడీసర్కారుకు, ప్రజలకు శుభాకాంక్షలు. కాశ్మీర్ ప్రజలు అభివృద్ధిపథంలో ముందుకు
    సాగాలి.. గుల్ పనాగ్ ఈరోజు ఇండియాకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చింది.. పరేశ్ రావెల్