దేశం తగలబడ్తుంటే.. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తరా! మాక్రన్​పై నెటిజన్ల ఫైర్ 

దేశం తగలబడ్తుంటే.. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తరా! మాక్రన్​పై నెటిజన్ల ఫైర్ 
పారిస్ : ఒకవైపు ఫ్రాన్స్ తగలబడిపోతుంటే.. అధ్యక్షుడు మాక్రన్ అదేమీ పట్టించుకోకుండా మ్యూజిక్ కాన్సర్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పారిస్ లో బ్రిటిష్ సింగర్ నిర్వహించిన ‘ఫేర్ వెల్ ఎల్లో బ్రిక్ రోడ్ టూర్’ మ్యూజిక్ కాన్సర్ట్ లో భార్య బ్రిజిట్ తో కలిసి మాక్రన్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి శుక్రవారం నుంచి వైరల్ అవుతోంది.

దేశం నిరసనలతో అట్టుడుకుతుంటే అధ్యక్షుడు ఇలా మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, ఇది మాక్రన్ బుధవారం రాత్రి జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొన్న సందర్భంగా తీసిన వీడియోలోని క్లిప్ అని, అప్పటికి దేశంలో నిరసనలు పెద్ద ఎత్తున లేనందున ఆయనను తప్పుపట్టాల్సిన అవసరం ఏముందని మరికొందరు నెటిజన్లు సమర్థిస్తున్నారు.