మెహర్ అన్న ప్లాప్ ఇచ్చాడుగా..వరల్డ్ కప్ భారత్‌దే..ఇదేం సెంటిమెంట్ రా బాబూ!

మెహర్ అన్న ప్లాప్ ఇచ్చాడుగా..వరల్డ్ కప్ భారత్‌దే..ఇదేం సెంటిమెంట్ రా బాబూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఐదు భారీ సినిమాలు తీసి.. ఒక్క హిట్టు కూడా కొట్టని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది మెహర్ రమేష్ (Meher Ramesh) అనే చెప్పాలి. అందులో ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్(NTR), వెంకటేష్(Venkatesh), చిరంజీవి(Chiranjeevi) వంటి స్టార్ హీరోలు ఉన్నారు. అయినా కూడా మనోడికి ఒక్క హిట్టు కూడా పడలేదు. అందుకే మెహర్ రమేష్ ను ఫ్లాప్స్కి కేరాఫ్ అంటారు ఆడియన్స్. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో తీసిన భోళా శంకర్ కూడా భారీ డిజాస్టర్గా నిలిచింది. భోళా డిజాస్టర్ తరువాత మెహర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

లేటెస్ట్ గా మరోసారి మెహర్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకో తెలిస్తే..అందరు షాక్ అవుతారు. ఇవాళ ప్రపంచకప్ ఫైనల్ రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్నో విధాలుగా ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. క్రికెట్ ఫ్యాన్స్..సినిమా ఫ్యాన్స్..కొంతమంది సినీ, క్రికెట్ ప్రెడిక్టర్స్ చాలా క్రియేటివ్‌గా వీడియోస్ను ఎడిట్స్ చేయడంలో బిజీగా ఉన్నారు. దీంతో నెటిజన్స్ తమ క్రియేటివిటీని పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. క్రికెట్ కు సంబంధించి రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

అసలు విషయానికి వస్తే..దర్శకుడు మెహర్ రమేష్‌ మీద వస్తున్నమీమ్స్ పీక్ లెవల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన డిజాస్టర్ మూవీ తీసిన ప్రతిసారీ ఇండియా టీమ్ ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందనే సెంటిమెంట్ మీద మీమ్స్ కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ కూడా వీటిని షేర్ చేస్తున్నారు. 

ఎన్టీఆర్ హీరోగా 2011లో మెహర్ రమేష్ తీసిన ‘శక్తి’ మూవీ టైములో ఇండియా వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. అప్పుడు శక్తి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. 

ఇక వెంకటేష్ హీరోగా 2013లో ‘షాడో’ మూవీ రిలీజైన టైములో..ఆ ఏడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచింది. అప్పుడు షాడో అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. మెహర్ రమేష్ ఆ తర్వాత పదేళ్ల పాటు ఏ సినిమా కూడా ప్రకటించలేదు. ఇక ఆ తర్వాత ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సొంతం చేసుకోలేదు.

ఇక రీసెంట్గా మెహర్ రమేష్..ఈ ఏడాది 2023 లో భారీ అంచనాలతో తెరకెక్కించిన ‘భోళా శంకర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో మెహర్ భోళా మూవీ ప్లాప్ తో లింక్ పెట్టి.. ప్రస్తుతం బరిలో ఉన్న ఇండియా ప్రపంచకప్ ను ముడిపెడుతూ చేస్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

ఇండియా తప్పకుండా గెలుస్తుంది..టెన్షన్ పడకండి అంటూ నెటిజన్లు మీమ్స్ మోత మోగిస్తున్నారు. నిన్నట్నుంచి ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇక మెహర్ మీమ్స్ తగ్గకుండా..అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఇండియా కప్పు గెలిస్తే ఈ మీమ్స్ మరింత మోతెక్కిపోతాయేమో..చూడాలి.

టీమిండియా కప్ గెలవడానికి ఇదొక్కటే కాదు వేరే సెంటిమెంట్లు కూడా కలిసొస్తున్నాయి. 2011 నుంచి వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన జట్టే వన్డే వరల్డ్ కప్‌ను గెలుస్తోంది. దీంతో ఈసారి కూడా వరల్డ్ కప్ భారత్‌దే అని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.