
టాలీవుడ్లో ఉన్న ఒక్క ఆఫర్‌ను కూడా పోగొట్టుకుంది పూజా హెగ్దే(Pooja hegde). త్రివిక్రమ్(Trivikram)– మహేశ్ బాబు(Mahesh babu) కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం(Guntur kaaram)’ నుంచి ఇటీవల పూజా ఔటైన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు పూజాను పక్కన పెట్టడం ఏంటని అంతా షాకయ్యారు. తాజాగా విడుదలైన ‘బ్రో(Bro)’ టీజర్‌కు ఈ విషయంతో ముడిపెడుతున్నారు నెటిజన్లు. చెప్పిన సమయం కంటే ఈ టీజర్‌ను కాస్త ఆసల్యంగా విడుదల చేశారు మేకర్స్.
అయితే, టీజర్లో ముందుగా ఓ యాడ్‌లో పూజా ప్రత్యక్షమవ్వడం చూసి ఓహో అందుకేనా టీజర్ లేటైంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ పూజాను బ్రో సినిమాలో ఇలా ‘యాడ్’ చేశాడా అంటూ నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఎంతైనా ఆయన సినిమాలో పూజా ఉంటే అదో సెంటిమెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంతో త్రివిక్రమ్ సినిమాలో పూజా అలవైకుంఠపురం, అరవింద సమేత వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.