T20 World Cup 2024: కోహ్లీ పట్ల బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ.. అమెరికా వెళ్లకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్

T20 World Cup 2024: కోహ్లీ పట్ల బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ.. అమెరికా వెళ్లకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్

ఐపీఎల్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విరామం తీసుకోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ  నిర్ణయం వ్యక్తిగతమే అయినప్పటికీ వరల్డ్ కప్ కు ముందు బ్రేక్ తీసుకోవడం అభిమానులకు నచ్చలేదు. దీంతో విరాట్ పై నెటిజన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆర్సీబీ తరపున ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా ఆడిన కోహ్లీ..వరల్డ్ కప్ కు ప్రాక్టీస్ మ్యాచ్ కు దూరమవ్వడం సరైనదికాదని కొందరు అంటుంటే.. స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రత్యేకాధికారాలు కల్పిస్తోందని మరికొందరు విమర్శించారు.

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ వచ్చే సరికి బ్రేక్ తీసుకున్నాడని.. కోహ్లీ దేశానికి ఎన్ని పరుగులు చేసినా అతను ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉండాలని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా.. విరాట్ కోహ్లీ ఆలస్యంగా అమెరికాలో అడుగుపెడతాడని.. ఇందుకు గాను BCCI నుండి అనుమతి పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రకారం కోహ్లి మే 30వ తేదీ ఉదయం న్యూయార్క్‌కు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్‌ ఆడే ఏకైక వార్మప్‌ మ్యాచ్‌లో విరాట్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఐపీఎల్ కు ముందు కోహ్లీ.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్, ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ నుంచి  తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2024 లో తలపడే భారత క్రికెట్ బృదం అమెరికా శనివారం (మే 25) బయలుదేరింది. ప్రయాణ బృందంలో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు ప్రధాన క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఐపీఎల్ కు ముందు కోహ్లీ.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్, ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ నుంచి  తప్పుకున్న సంగతి తెలిసిందే.