
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. వైష్ణవ్ తేజ్ మాస్ అవతార్ లో దుమ్ముదులిపేసిన ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే.. ఈ టీజర్ ను బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
దీనికి కారణం.. ఆదికేశవ టీజర్ ఒక క్వారీలో ఓపెన్ అవుతుంది. ఆ క్వారీ స్థలంలో ఒక శివాలయం ఉంటుంది. మైనింగ్ కోసం ఈ శివాలయాన్ని సైతం పడగొట్టడానికి సిద్దమవుతాయారు విలన్స్. వాళ్ళని అడ్డుకొని ఆలయాన్ని కాపాడేందుకు హీరో వస్తాడు అన్నట్టుగా టీజర్లో చూపించారు మేకర్స్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను గాలి జనార్దన్ రెడ్డికి ఆపాదిస్తున్నారు కొంతమంది నెటిజన్స్. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అంటే మైనింగ్ కింగ్. మైనింగ్ వ్యాపారంలో భాగంగా.. ఆయన ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులో ఉన్న సుంకులమ్మ గుడిని పడగొట్టాడు. ఆ ఆలయం జోలికి వెళ్లిన తర్వాత నుండే గాలి జనార్దన్ రెడ్డి పతనం మొదలైంది. ఆ గుడి వల్లే తనకు ఈ గతి పట్టిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు గాలి జనార్ధన్ రెడ్డి.
ఇక ఆదికేశవ టీజర్ కూడా మైనింగ్ ఏరియాలో ఉన్న గుడిని కూల్చడం నేపథ్యంలో రావడంతో.. నెటిజన్స్ గాలి జనార్ధన్ రెడ్డిని ఈ టీజర్ కు లింక్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమా గాలి జనార్ధన్ రెడ్డి కథతో రానుందా? లేదా? అనేది తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.