ఐ బొమ్మ రవికి ఆదరణెందుకు.?.మధ్యతరగతి దేవుడంటూ పోస్టులు..ఠాగూర్ లో చిరంజీవి లెవల్ లో తారీఫ్

ఐ బొమ్మ రవికి ఆదరణెందుకు.?.మధ్యతరగతి దేవుడంటూ పోస్టులు..ఠాగూర్ లో చిరంజీవి లెవల్ లో తారీఫ్
  • పోలీసులకు వ్యతిరేకంగా మీమ్స్
  •  రవికి అండగా నిలుస్తున్న నెటిజన్లు
  • రియల్ రాబిన్ హుడ్ అంటూ పొగడ్తలు
  • వినోద్ పేరిట బిజినెస్ చేస్తున్నారంటూ నిర్మాతలపై మండిపాటు
  • రవి ఏకాణ తీసుకోకుండా సినిమాలు చూపిస్తున్నారని పొగడ్తలు
  • ఎన్ కౌంటర్ చేయాలన్న సీ కల్యాణ్ పై విమర్శలు

హైదరాబాద్: మధ్యతరగతి దేవుడు ఐ బొమ్మ రవి.. ఆయన ఇండియన్ రాబిన్ హుడ్.. ఠాగూర్ సినిమాలో చిరంజీవి.. శివాజీ సినిమాలో రజనీకాంత్.. ఇవి నెటిజెన్ల పొగడ్తలు. ఇటీవల పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ఇమ్మడి రవికి సోషల్ మీడియా వేదికగా మద్దతు పెరుగుతోంది. అదే సమయంలో అరెస్టు చేసిన పోలీసులకు వ్యతిరేకంగా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఐబొమ్మ రవినిన అరెస్టు చేసిన 24 గంటల్లో బప్పం టీవీ, ఐ బొమ్మ వెబ్ సైట్లు క్లోజ్ అయ్యాయి. అయితే బొమ్మ1 టీవీ పేరుతో మరో వెబ్ సైట్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో పాటు తమిల్ మూవీ రూల్జ్ పేరుతో నడుస్తున్న మరో వెబ్ సైట్ లోనూ కొత్త సినిమాలు అందుబాటులో ఉండటం పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉండగా ఇవాళ నాంపల్లి కోర్టులో పోలీసులు ఐ బొమ్మ రవి కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది.

నెటిజన్ల సపోర్ట్

పైరసీ తప్పయితే సినిమా టికెట్ల రేట్లు పెంచడమూ తప్పే.. ఒక ఇంట్లో నలుగురం సినిమాకు పోతే మూడు వేలు ఖతం అవుతున్నాయి.. ఐ బొమ్మలో ఫ్రీగా ఇంటిల్లిపాదీ సినిమా చూస్తున్నం.. అంటున్నారు నెటిజెన్లు.. ఇంతకు సినిమా నిర్మాతలను వందల కోట్లు  పెట్టి ఎవరు సినిమాలు తీయుమన్నారంటూ ప్రశ్నిస్తున్నారు..? మొన్నటి ప్రెస్ మీట్ లో ఐ బొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలన్న నిర్మాత సీ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన తప్పుల చిట్టాను ఎత్తి చూపుతున్నారు. పైరసీ చేసే వాళ్లు సంఘ సేవల చేయట్లేదన్న ఎస్ఎస్ రాజమౌళికీ నెటిజెన్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరేమైనా సంఘ సేవ చేస్తున్నారా..? వినోదం పేరుతో బిజినెస్ చేస్తున్నారు కదా..? మిమ్మల్ని విదేశాలకు వెళ్లి ఎవరు షూటింగులు చేయుమన్నారని ప్రశ్నిస్తున్నారు.. వందల కోట్లు పెట్టి ఎవరు సినిమా తీయుమన్నారంటూ సీరియస్ అవుతున్నారు. సినిమాను పైరసీ చేయడం తప్పయితే టికెట్ల  రేట్లు పెంచుకోవడం కూడా తప్పే అని ముక్త కంఠంతో వాదిస్తున్నారు.  

►ALSO READ | వెయ్యి రూపాయలు పెట్టలేకనే.. ఫ్రీగా ఐబొమ్మలో సినిమా చూస్తున్నరు

పోలీసులపై మీమ్స్

ఐబొమ్మ రవికి నెటిజెన్ల నుంచి పెద్ద సపోర్ట్ లభిస్తోంది. ఏకాణ తీసుకోకుండా కొత్త సినిమాలు చూపిస్తున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్య తరగతి దేవుడనీ పోస్టులు పెడుతున్నారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి మాదిరిగా తారీఫ్ చేస్తున్నారు. అరెస్టు చేసిన పోలీసుపై ఏకంగా మీమ్స్ చేస్తున్నారు. దీనిపై సీపీ సజ్జనార్ మండిపడ్డారు. ఐ బొమ్మ రవిని అరెస్టు చేస్తే ప్రజలు తమపై మీమ్స్ చేస్తున్నారని, వారిపైనా కేసులు పెడతామంటూ హెచ్చరించారు. దీనిపైనా నెటిజెన్లు గట్టిగానే స్పందించారు. బంగారం దుకాణంలో చోరీ జరిగితే షాపు యజమానులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారా..? సీపీగారూ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలు, సినిమా హీరోలు, దర్శకులతో కలిసి సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్  పెట్టడాన్ని తప్పు పడుతున్నారు. ఐ బొమ్మ రవి రియల్ హీరో అని రియల్ రాబిన్ హుడ్ అని పేర్కొంటున్నారు.