చాలామంది ఖరీదైన ఇయర్‌బడ్స్‌ని వాడుతుంటారు. కానీ.. అవి కొన్నిసార్లు చెవిలో నుంచి జారి పడిపోతుంటాయి. అందుకే వాటిని ఇలాంటి మాగ్నెటిక్ స్ట్రింగ్‌కి ఎటాచ్ చేసి వాడుకుంటే సరిపోతుంది. ఈ యాంటీ లాస్ట్ మాగ్నెటిక్ స్ట్రింగ్‌ని సౌన్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ స్ట్రింగ్‌కి రెండు వైపులా ఇయర్‌బడ్స్‌ని ఎటాచ్ చేసుకోవచ్చు.
స్ట్రింగ్‌ని మెడలో వేసుకుంటే సరిపోతుంది. చెవిలో నుంచి బయటికి తీసినప్పుడు గ్రిప్పుల్లోని మ్యాగ్నెటిక్స్ వల్ల బడ్స్ ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. దీన్ని ముఖ్యంగా యాపిల్ ఎయిర్‌పాడ్స్ కోసం తయారుచేశారు. ఈ స్ట్రింగ్‌ని స్కిన్ ఫ్రెండ్లీ సిలికాన్‌తో తయారుచేశారు.
►ALSO READ షూ ఉతకడంకోసం..వాషింగ్ బ్యాగ్
దీనిపొడవు 27.5 అంగుళాలు. ఎక్సర్‌సైజ్, జాగింగ్, సైక్లింగ్, యోగా చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా తేలికైనది. బరువు కేవలం 14 గ్రాములు మాత్రమే ఉంటుంది. ధర: రూ. 116 లు.
