షూలను చేతితో ఉతికి నొప్పులు పుట్టి ఇబ్బంది పడుతున్నారా? ఇకపై షూలను చేతితో ఉతకాల్సిన పనిలేదు. అవునండీ.. షూలను ఉతికేందుకు ప్రత్యేక షూ వాషింగ్ బ్యాగ్ వచ్చేశాయి. ఈ బ్యాగుల సాయంతో నేరుగా షూలను వాషింగ్ మిషన్ లోవేసి ఉతకవచ్చు. దీన్ని టీసీసీఓ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
బ్యాగ్‌ని మెత్తటి ఫైబర్‌తో తయారుచేశారు. దీనిలోపల 1450జీఎస్‌ఎం ఉండే 20,000కుపైగా ఫ్లఫీ ఫైబర్స్ ఉంటాయి. అవి మందంగా, 1.2 అంగుళాల పొడవు ఉంటాయి. వాటివల్ల షూఈజీగా క్లీన్ అవుతుంది. బ్యాగ్‌లో ఒక జత షూలకు సరిపడా స్పేస్ మాత్రమే ఉంటుంది.
షూలు దెబ్బతినకుండా , సురక్షితంగా శుభ్రం కావాలంటే ఇది మంచి పరిష్కారం మార్గం.ఈ వాషింగ్ బ్యాగ్ ధర : రూ. 299
►ALSO READ | సుప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్... భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు
