కొత్తగా 75 గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలు

కొత్తగా 75 గవర్నమెంట్​  మెడికల్​ కాలేజీలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా 75 గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్  కమిటీ(సీసీఈఏ) బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్​ భేటీ తర్వాత సమాచార శాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ మీడియాతో మాట్లాడుతూ.. 2022లోగా కొత్త కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని, ఇందుకోసం 24వేల 375 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, తద్వారా మెడికల్​ పీజీ, ఎంబీబీఎస్​లో 15,700 సీట్లు అదనంగా పెరుగుతాయని వివరించారు. 300 అంతకంటే ఎక్కువ బెడ్లున్న జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తామని  చెప్పారు. మెడికల్​ ఎడ్యుకేషన్​ విస్తరణకు సంబంధంచి ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదని, గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్​ సర్వీసులు, చదువుకునే విద్యార్థుల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతోనే మోడీ సర్కార్​ ఈ మేరకు చర్యలు చేపట్టిందని జవదేకర్​ అన్నారు.

చెరుకు రైతులకు భారీ సబ్సిడీ

2019-–20 సంవత్సరానికి గాను 60 లక్షల టన్నుల చెరుకు ఎగుమతి కోసం ఎక్స్‌పోర్ట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం 6వేల 268 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ సబ్సిడీ మొత్తం నేరుగా వివిధ రాష్ట్రాల్లోని చెరుకు రైతుల ఖాతాల్లోకి వెళుతుందని జవదేకర్​ చెప్పారు.

ఎన్డీఆర్​ఎఫ్​​ తరహాలో సీడీఆర్​ఐ

ప్రకృతి విపత్తుల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతర్జాతీయంగా కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇండియా ప్రయత్నాలు ఆరంభించింది. ఆ మేరకు  ఇంటర్నేషనల్ కోయెలీషన్​ ఫర్ డిజాస్టర్ రీసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(సీడీఆర్​ఐ)ని  ప్రధాని మోడీ యూఎన్ఓలో ​ప్రకటిస్తారు.   స్కిల్​ డెవలప్​మెంట్ రంగాలకు సంబంధించిన ‘వరల్డ్​ స్కిల్​ ఒలింపియాడ్​’ను  ఇండియాలో నిర్వహించాలని కేంద్రం డిసైడైంది.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి