
- విడుదల చేసిన రిటైర్డ్ జస్టిస్ కేజి బాలకృష్ణన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికి తెలియని విషయాలను తెలియజేస్తూ రూపొందించిన మోడీ బయోగ్రఫీని రిటైర్డ్ జస్టిజస్ కే.జీ. బాలకృష్ణన్ రిలీజ్ చేశారు. మన దేశంలో మోడీ ఆరేళ్ల పాలన పూర్తైన సందర్భంగా దీన్ని రిలీజ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటర్నెట్ ద్వారా విడుదల చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. “ నరేంద్ర మోడీ– హర్బింజర్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అపాస్టిల్ ఆఫ్ వరల్డ్ పీస్” పేరుతో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యురిస్ట్ అండ్ ఛైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ అగర్వాలా ఈ పుస్తకానికి కో – ఆథర్‌గా వ్యవహరించారు. అమెరికాకు చెందిన రచయిత్రి, కవయిత్రి ఎలిసాబెత్ హోరన్ కూడా కూడా ఈ పస్తకం రాయడంలో సహకారం అందించారు. ఈ పుస్తకం రెండు ఫార్మెట్లలో దొరుకుంతుందని అగర్వాలా చెప్పారు. మొత్తం 20 భాషల్లో దీన్ని తసుకొచ్చారు.