ఆర్టీసీ బాగు కోసం కొత్త మార్పులు

ఆర్టీసీ బాగు కోసం కొత్త మార్పులు
  • ‘వెలుగు’ కథనంపై ఎండీ సజ్జనార్  

హైదరాబాద్, వెలుగు: ‘ఆర్టీసీ బాగు కోసమే డిపోలలో మార్పులు, చేర్పులు’ చేస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. సోమవారం ‘వెలుగు’లో ‘బస్సు డిపోలకు తాళం’ పేరుతో పబ్లిష్​ అయిన కథనంపై ఆయన స్పందించారు. తప్పనిసరి  పరిస్థితుల్లో మాత్రమే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నామని, ఇవి కూడా రవాణా సేవలను మరింత మెరుగుపర్చేందుకేనని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రయాణీకులకు మరిన్ని సౌలతులు, మంచి రవాణా సేవలు అందించే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోందన్నారు. ఇటీవల కొన్ని కొత్త డిపోలను కూడా ప్రారంభించామని తెలిపారు. డిపోలను లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు ఇప్పటివరకూ లేవని సజ్జనార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరిన్ని డిపోలను ఖాళీ చేసే ఆలోచన లేదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
బ్లడ్‌‌‌‌ డొనేట్‌‌‌‌ చేస్తే బస్సుల్లో ఒక రోజు ఫ్రీ జర్నీ
రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల్లో రెడ్‌‌‌‌క్రాస్‌‌‌‌ సొసైటీ సహకారంతో మెగా బ్లడ్‌‌‌‌ డొనేషన్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎండీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఆయా డిపోల్లో రక్తదానం చేసిన వారికి అన్ని బస్సుల్లో ఒక రోజు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.