కొత్తగా 48,661 కరోనా కేసులు నమోదు

కొత్తగా 48,661 కరోనా కేసులు నమోదు

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. గత 24 గంటల్లో 48,661 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ కొత్త కేసులతో కలిపి దేశం మొత్తం మీద 13,85,522 కేసులు నమోదయ్యాయి. వీటిలో 4,67,882 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 8,85,577కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 705 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 32,063కు చేరింది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. శనివారం దేశంలో 4,42,263 శాంపిళ్లు పరీక్షించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,62,91,331 శాంపిళ్లు పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

For More News..

నార్త్ కొరియాలో మొదటి కరోనా అనుమానిత కేసు.. లాక్డౌన్ ప్రకటించిన అధికారులు

హోంక్వారంటైన్ లో మంత్రి ఎర్రబెల్లి

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్