జెనీవా: యూకేలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే మ్యూటెంట్‌ను అదుపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను త్వరగా తీసుకోవాలని సూచించింది. కరోనా పలు చోట్ల అత్యధిక స్థాయిలో విరుచుకుపడటాన్ని చూశామని, కానీ దాన్ని కంట్రోల్ చేయగలిగామన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో పరిస్థితి అదుపు తప్పలేదని, అయితే దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ చీఫ్ మైకేల్ ర్యాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.
బ్రిటన్‌లో కరోనా చేయి దాటిందని ఆ దేశ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాంకాక్ చెప్పిన నేపథ్యంలో మైకేల్ ర్యాన్ పైవిధంగా స్పందించారు. కరోనాను నియంత్రించే దిశగా ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు భేషుగ్గా ఉన్నాయని, వీటినే మరింత తీవ్రతతో కొనసాగించాలని సూచించారు. ఈ వైరస్‌ను కూడా కంట్రోల్ చేయగలమని దీమా వ్యక్తం చేశారు. మరింత ఇంటెన్సిటీతో పని చేస్తే ఒకవేళ వైరస్ వ్యాప్తి ఎక్కువైనా తక్కువ టైమ్‌లోనే అదుపు చేయగలన్నారు. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై సుమారుగా 30కి పైగా దేశాలు నిషేధం విధించాయి. అందులో భారత్ కూడా ఉంది.
