మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో.. భీమారంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో.. భీమారంలో  క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు

జైపూర్(భీమారం), వెలుగు: మంత్రి వివేక్​ వెంటకస్వామి చొరవతో మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు సాధ్యమైందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పొడేటి రవి, సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి తెలిపారు. బుధవారం ఎస్సై రాజేందర్‌‌‌‌తో కలిసి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత కోరిక మేరకు క్రికెట్ గ్రౌండ్ కోసం ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు చెప్పారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.