అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి : తోలెం మమత

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి :  తోలెం మమత

పాల్వంచ, వెలుగు : జిల్లాలో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని న్యూ డెమోక్రసీ అనుబంధ పీఓడబ్ల్యూ  స్త్రీ సంఘటన జిల్లా కార్యదర్శి తోలెం మమత డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 

పూర్తిగా ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా పేదలు, ఆదివాసీ గిరిజనులు ఉన్న నేపథ్యంలో ఎటువంటి షరతులు లేకుండా ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంజ సోమక్క, బట్ట సూరమ్మ, గొంది లక్ష్మి, కంగాల గౌతమి, మల్లమ్మ, రత్తమ్మ, సీత, రాజేశ్వరి, లలిత పాల్గొన్నారు.