కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో బుక్స్ భారం తగ్గి క్రియేటివిటీ పెరుగతది

కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో బుక్స్ భారం తగ్గి క్రియేటివిటీ పెరుగతది

న్యూ ఇండియాకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పునాది లాంటిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు . ఈ పాలసీ పిల్లలపై బుక్స్  భారాన్ని తగ్గించి, క్రియేటివిటీని పెంపొందిస్తుందని చెప్పారు . ఇన్నాళ్లు‘వాట్ టు థింక్’ అనే రీతిలో ఎడ్యుకేషన్ పాలసీ కొనసాగిందని, ఇక నుంచి ‘హౌ టు థింక్’ కోణంలో చదువులు కొనసాగుతాయని వివరించారు. దీని వల్లమన స్టూడెంట్లకు ప్రపంచ స్థాయిలో విస్తృత అవకాశాలు దక్కుతాయని, కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయని పేర్కొన్నారు . న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అన్ని రాష్ట్రాలు మహాయజ్ఞంలా అమలు చేయాలని, ఇందుకోసం అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు కొత్త పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని అమలుపై విస్తృత స్థాయిలో, ఆరోగ్యకరంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. హెచ్ఆర్డీ, ర్డీయూజీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రిఫామ్స్పై నిర్వహించిన సదస్సులో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లోమాట్లాడారు. ‘‘కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక సర్క్యు లర్ ఇస్తేనో.. ఒక నోటిఫికేషన్ ఇస్తేనో పూర్తయ్యే ప్రాసెస్ కాదు. అందరి భాగస్వామ్యం ఉండాలి. అందరి దృఢ సంకల్పం కావాలి. మహాయజ్ఞంలా దీన్ని అమలు చేయాలి. న్యూ ఇండియాకు ఇది పునాది. వన్ నేషన్.. వన్ ఎడ్యుకేషన్ అవసరం” అని ఆయన పేర్కొన్నారు .

ఇన్నాళ్లూ వేరు.. ఇక నుంచి వేరు

ముప్పైఏండ్లపాటు ఎడ్యుకేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు లేవని, ఒక మూస విధానంలో అది నసాగిందని ప్రధాని అన్నారు. సిలబస్ పేరిట ఎక్కువ పుస్తకాలు అవసరం లేదని, పిల్లల్లో మనో వికాసాన్నిపెంచేలా సిలబస్ఉండాలని సూచించారు.అందులో భాగంగానే కొత్త పాలసీని తీసుకువచ్చామని చెప్పారు . న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు సం అన్నిరాష్ట్రాల్లోని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్ ఎడ్యకేషన్ బోర్డ్ సలహాలను అందించాలని, పాలసీని ఎలా అమలు చేయాలో సూచించాలనికోరారు. ‘‘ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్లలో క్రియేటివిటీని పెంచేలా ఉండాలి. అందుకు కొత్త పాలసీ తోడ్పడుతుంది. ఇందుకోసం నాలుగైదేండ్లు లక్షలాది దితో చర్చలు జరిపాం. 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్పులు తెచ్చాం. ఇక నుంచి స్టూడెంట్లపై పుస్తకాల భారం తగ్గుతుంది. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ థింకింగ్ పెరుగుతుంది. స్టూడెంట్లు తమకునచ్చిన కోర్సును చదివే వెసులుబాటు ఉంటుంది” అని ప్రధాని వివరించారు.

చేనేతను ప్రోత్సహిద్దాం

చేనేతకు చేయూతనిద్దామని, చేనేత వస్త్రాలను ధరిద్దామని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. శుక్రవారం నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఆయనట్వీట్చేశారు. ‘‘నేషనల్  హ్యాండ్లూమ్ సందర్భంగా చేనేత కార్మికులకు సెల్యూట్ చేస్తాన్నాను. ఆత్మనిర్భర్ భారత్కోసం చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం” అని కోరారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ కూడా చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వాలని సోషల్మీడియా వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొందరుమంత్రులు చేనేత వస్త్రాలు ధరించిఆ ఫొటోలను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్టు చేశారు. నేడు రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం ప్రారంభం ఢిల్లీలోని రాజ్ఘాట్లో శనివారం ప్రధాని నరేంద్రమోడీ ‘రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం ’ను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్లతో స్వచ్ఛ భారత్ గురించి ముచ్చటిస్తారు. ఈ ఇంటరాక్వ్టి సెంటర్ గురించి 2017 ఏప్రిల్ 10న ప్రధాని మోడీ ప్రకటించారు. వందేండ్ల కింద గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం నుంచి ఇప్పటి స్వచ్ఛ భారత్ ఉద్యమం వరకు అన్ని విశేషాలు ఈ సెంటర్లో ఉంటాయి.