ఇయ్యాల్టి నుంచే కొత్త ఎక్సైజ్ పాలసీ

ఇయ్యాల్టి నుంచే  కొత్త ఎక్సైజ్ పాలసీ
 
  • వైన్స్ టెండర్లు దక్కించుకున్నోళ్లకు రెండేండ్లు చాన్స్ 
  • నవంబర్ లో 2,200 కోట్ల  మద్యం అమ్మకాలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ (2023–25) అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపుల లైసెన్సు గడువు నవంబర్ 30వ తేదీతో ముగిసింది. ముందస్తుగా ఆగస్టు నెలలో నిర్వహించిన టెండర్లలో వైన్ షాపుల లైసెన్స్ లు దక్కించుకున్నవారు డిసెంబర్‌ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు. వైన్ షాపుల టెండర్లకు ఆగస్ట్ లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2,620 వైన్స్ లకు 1,31,490 అప్లికేషన్లు వచ్చాయి. 

సర్కార్​కు దరఖాస్తుల ద్వారానే రూ.2,629 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక నవంబర్‌లో దాదాపు రూ.2,200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నెలాఖరులోగా పాత స్టాక్‌ను క్లియర్‌ చేశారు. ఒక్క నెలలోనే 21.69 లక్షల లిక్కర్ కేసులు, 30.44 లక్షల కేస్​ల బీర్లు సేల్ అయ్యాయి. ఎన్నికల వేళ జనాలు బీర్లను విపరీతంగా తాగారు. జనాలు, ప్రచారానికి వెళ్లిన కార్యకర్తలు, లీడర్లు ఎవరు కూడా ఛీప్  లిక్కర్ పై ఇంట్రస్ట్ చూపలేదని తెలుస్తోంది. 

మద్యం ప్రియులు మినిమం బ్రాండ్ నే మెయింటైన్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఆయా రాజకీయ పార్టీల దావతుల్లో రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్ వంటి బ్రాండ్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో ఛీప్ లిక్కర్ తక్కువగా అమ్ముడుపోయినట్లుగా ఆ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.