ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2021 సరికొత్త విధానంలో జరగనుంది. IPL-14వ సీజన్‌లో 10జట్లు లీగ్ దశలో తలపడనున్నాయి. మొత్తం 10జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రస్తుతం క్యాష్‌రిచ్ లీగ్‌లో 8జట్లు తలపడుతున్నాయి. ప్రతిజట్టు ఒక్కో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. ఒకటి సొంత మైదానంలో… మరో మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్టు మైదానంలో పోటీపడతాయి. మొత్తంగా లీగ్‌దశలో ప్రతిజట్టు 14మ్యాచ్‌లు ఆడుతున్నాయి. టాప్-4 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. కాగా 2011సీజన్ లోనూ 10జట్లు తలపడ్డాయి. తర్వాత రెండేళ్లు 9జట్లు ఆడాయి. వచ్చే సీజన్లో 10జట్లు ఆడితే 2011తరహాలో ఉండే అవకాశం ఉంది. దీనిపై బీసీసీఐ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. కాగా 10జట్లు ఉంటే ఆటగాళ్ల విషయంలో పోటీ తప్పదని ప్రస్తుత ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
